Hyderabad Book Fair

Hyderabad Book Fair ◆ Hyderabad Book Fair ◆
◆ హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ 2025, ఎన్టీఆర్​ స్టేడియం ◆ We can’t wait to see you there!

Get Ready for the 37th Hyderabad Book Fair! ❤
The Hyderabad Book Fair is returning for its 37th edition, organized by a new committee! Join us from December 19th to 29th at NTR Grounds for an exciting literary experience. We’re introducing new facilities, reducing stall prices, and offering attractive discounts on books at every stall. Participating National and international publishing houses, in

cluding Our Academy, , , , , , Sage, Penguin, , and ArunaTara—all in one place! literary events and guest sessions featuring renowned authors, poets, and literary critics. Engage in thoughts and discussions, book launches, and interactive sessions that promise to inspire and enlighten. We invite the public, publishers, journalists, writers, stationery vendors, and college students—especially those from Telangana and Andhra Pradesh—to join us in making this festival a success!

https://www.v6velugu.com/hyderabad-bookfair-founder-gopalarao-passed-away
24/04/2026

https://www.v6velugu.com/hyderabad-bookfair-founder-gopalarao-passed-away

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు గోపాలరావు మృతి చెందారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ఆయన కుమారుడి నివా...

బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు గోపాలరావుగారి మృతి.--సంతాపం ప్రకటించిన బుక్ ఫెయిర్ అధ్యక్షుడు  కవియాకూబ్, , ఉపాధ్యక్షుడు మలుపు...
24/04/2026

బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు గోపాలరావుగారి మృతి.

--సంతాపం ప్రకటించిన బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవియాకూబ్, , ఉపాధ్యక్షుడు మలుపు బాల్ రెడ్డి, కార్యదర్శి ఆర్.వాసు, కోశాధికారి నారాయణరెడ్డి మరియు బుక్ ఫెయిర్ కార్యనిర్వాహక వర్గం.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు ఎస్.గోపాలరావు గురువారంనాడు కొండాపూర్‌లోని తన కుమారుడి నివాసంలో మృతి చెందారు.
90 సంవత్సరాలు వయస్సు ఉన్న గోపాలరావు ఏప్రిల్ 23 గురువారం నాడు కొండాపూర్‌లోని తన కుమారుడి ఇంట్లో అనారోగ్య కారణాలతో అకాలమృతి చెందారు.
వారి బౌతిక దేహాన్ని ఏప్రిల్ 26 ఆదివారం నాడు ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లోని తన గృహంలో
మిత్రుల సందర్శనార్థం ఉంచి, అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సోము గోపాలరావు 1986లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. తొలి పుస్తక ప్రదర్శనకు సమన్వయకర్తగా వ్యవహరించారు. సైంటిఫిక్ సర్వీసెస్ అనే సంస్థ ద్వారా వారు పుస్తక రంగానికి సేవలు అందించారు. అనేక పుస్తక ప్రదర్శనల నిర్వహణలో వారి పాత్ర వున్నది.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు డా.కవియాకూబ్, ఉపాధ్యక్షుడు మలుపు బాల్ రెడ్డి, బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్.వాసు,కోశాధికారి నారాయణరెడ్డి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేసారు.

29-12-2025 38th HYDERABAD BOOK FAIR ముగింపు సభ   #హైదరాబాద్_బుక్_ఫెయిర్ #పుస్తకం             #హైదరాబాద్_బుక్_ఫెయిర్  #పు...
13/01/2026

29-12-2025 38th HYDERABAD BOOK FAIR ముగింపు సభ


#హైదరాబాద్_బుక్_ఫెయిర్
#పుస్తకం








#హైదరాబాద్_బుక్_ఫెయిర్

#పుస్తకం


29-12-2025 Kavi Sammelan 38th HYDERABAD BOOK FAIR  #2025   #హైదరాబాద్_బుక్_ఫెయిర్ #పుస్తకం             #హైదరాబాద్_బుక్_ఫ...
13/01/2026

29-12-2025 Kavi Sammelan 38th HYDERABAD BOOK FAIR #2025

#హైదరాబాద్_బుక్_ఫెయిర్
#పుస్తకం








#హైదరాబాద్_బుక్_ఫెయిర్

#పుస్తకం


29-12-2025 Kavi Sammelan 38th HYDERABAD BOOK FAIR  #2025   #హైదరాబాద్_బుక్_ఫెయిర్ #పుస్తకం             #హైదరాబాద్_బుక్_ఫ...
13/01/2026

29-12-2025 Kavi Sammelan 38th HYDERABAD BOOK FAIR #2025


#హైదరాబాద్_బుక్_ఫెయిర్
#పుస్తకం








#హైదరాబాద్_బుక్_ఫెయిర్

#పుస్తకం


అక్షర జాతరకు ‘నీరాజనం’.. రికార్డు స్థాయిలో పుస్తకాల అమ్మకాలు!38వ హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌లో రూ. 1.57 కోట్ల ఆదాయం.. రూ. 1....
11/01/2026

అక్షర జాతరకు ‘నీరాజనం’.. రికార్డు స్థాయిలో పుస్తకాల అమ్మకాలు!
38వ హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌లో రూ. 1.57 కోట్ల ఆదాయం.. రూ. 1.31 కోట్ల ఖర్చు: నిర్వాహకుల వెల్లడి

హైదరాబాద్‌: భాగ్యనగరంలో అక్షర పండుగ దిగ్విజయంగా ముగిసింది. సోషల్ మీడియా యుగంలోనూ పుస్తక పఠనం తగ్గలేదని, చదువరులసంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఈ ఏడాది జరిగిన 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిరూపించింది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బుక్ ఫెయిర్ సొసైటీ ప్రతినిధులు ప్రదర్శన ముగింపు వివరాలను, సమగ్ర ఆదాయవ్యయాలను అధికారికంగా వెల్లడించారు.

చారిత్రాత్మక విజయం:
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు, కవి యాకూబ్ మాట్లాడుతూ.. "పుస్తక పఠనం కనుమరుగవుతుందన్న వాదనలను ఈసారి వచ్చిన భారీ జనసందోహం పటాపంచలు చేసింది. లక్షలాదిగా తరలివచ్చిన యువతే తెలంగాణలో వస్తున్న జ్ఞానవంతమైన మార్పుకు నిదర్శనం" అని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా ప్రాంగణానికి అందశ్రీ పేరుతో పాటు, వివిధ వేదికలకు అనిశెట్టి రజిత, కొంపెల్లి వెంకట్ గౌడ్ వంటి తెలంగాణ స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టి నివాళి అర్పించామన్నారు.

రికార్డు స్థాయిలో అమ్మకాలు:
సొసైటీ కార్యదర్శి వాసు మాట్లాడుతూ.. 11 రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శనలో సుమారు రూ. 8 కోట్లకు పైగా విలువైన పుస్తకాలు అమ్ముడయ్యాయని, ఇది ఒక రికార్డని తెలిపారు. దేశంలోనే మూడవ అత్యుత్తమ బుక్ ఫేర్‌గా హైదరాబాద్ ఎదిగిందని గర్వంగా ప్రకటించారు. 1200కి పైగా విద్యార్థులతో నిర్వహించిన 'బాలోత్సవ్' కార్యక్రమాలు, డిసెంబర్ 24న జరిగిన 'పుస్తక నడక' కార్యక్రమాలు ప్రజలలో విశేషమైన చైతన్యాన్ని నింపాయని వివరించారు.

భవిష్యత్తు లక్ష్యం:
లిటరరీ ఫెస్టివల్ హైదరాబాద్ బుక్ ఫేర్‌ను త్వరలో పూర్తిస్థాయి 'లిటరరీ ఫెస్టివల్'గా తీర్చిదిద్దుతామని సొసైటీ ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది 'పుస్తకస్ఫూర్తి' చర్చాగోష్ఠుల్లో 300 మందికి పైగా సాహిత్యకారులు పాల్గొన్నారని, కొంపెల్లి వెంకట్ గౌడ్ వేదికపై రికార్డు స్థాయిలో 54 పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయని వివరించారు. సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన 'పల్లెకు పుస్తకం' కార్యక్రమం ద్వారా సేకరించిన వేలాది పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథాలయాలకు అందించామన్నారు. ఒకప్పుడు కేవలం వ్యాపారవేదికగా ప్రారంభమైన ఈ ప్రస్థానం, నేడు తెలంగాణ మేధోశక్తికి ప్రతీకగా మారిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఆదాయవ్యయాల వివరాలు ఇలా ఉన్నాయి.

- ప్రదర్శనకు సంబంధించిన ఆర్థిక వివరాలను నిర్వాహకులు పారదర్శకంగా వెల్లడించారు:

- మొత్తం ఆదాయం: రూ. 1,57,85,840/- (స్టాళ్ల రుసుము, స్పాన్సర్లు, టికెట్లు తదితరాల ద్వారా).

మొత్తం ఖర్చు: రూ. 1,31,60,431/- (నిర్మాణం, పబ్లిసిటీ, మెయింటెనెన్స్ తదితరాలు). ఈ వివరాలన్నింటినీ త్వరలోనే అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.

కార్య‌క్ర‌మంలో కోశాధికారి పి. నారాయ‌ణ‌రెడ్డి, ఉపాధ్య‌క్షుడు బి శోభ‌న్ బాబు, సంయుక్త కార్య‌ద‌ర్శులు‌, ఎం. సూరిబాబు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు టి. సాంబ‌శివ‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు

Address

HYDERABAD BOOK FAIR OFFICE ADDRESS:, , #MH Bhavan, 2nd Floor, Plot No. 21/1, Azamabad, Near RTC Kalyana Mandapam, Bagh Lingampally, Hyderabad-500020, , Cell: 7337411846 9490099081 9948106008
Hyderabad
500095

Alerts

Be the first to know and let us send you an email when Hyderabad Book Fair posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category