Sri Laxmi Narsimha Swamy Stationary & Xerox

Sri Laxmi Narsimha Swamy Stationary & Xerox Pen and pencil shops-retail
School supplies-retail
Stationery stores-retail
Writing supplies-retail

14/05/2022
23/04/2021
06/03/2020

PLEASE READ IMPORTANT

గుణత్రయవిభాగ యోగము, భగవద్గీతలో పదినాల్గవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

భగవానుడు:

మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు. మూడుగుణాలు కలిగిన "మాయ" అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది.అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి, నేనే తండ్రి. ప్రకృతి సత్వ, రజో, తమోగుణాలచే కూడి ఉంటుంది.నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కలిగినప్పుడు ఈ గుణాలకు బద్ధుడవుతున్నాడు. సత్వ గుణం పరిశుద్ధమైనది.అది పాపాలనుండి దూరం చేస్తుంది.ఈ గుణం కలిగినవారు సౌఖ్యం, జ్ఞానం చే బంధితులు అవుతారు. రజోగుణం కామ, మోహ, కోరికల కలయిక చేత కలుగుతోంది.ఈ గుణం కలిగిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు. అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది.సోమరితనం, నిద్ర, పొరపాటు అనేవాటితో బంధితులను చేస్తుంది. సత్వగుణం జీవున్ని సుఖబద్ధుడిగా, రజోగుణం పనిచేయువానిగా, తమోగుణం ప్రమాదకారిగా చేస్తుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కో గుణం ఆధిపత్యం వహిస్తుంది. సర్వేంద్రియాలు జ్ఞానకాంతిచే ప్రకాశిస్తున్నప్పుడు సత్వగుణం ఉందని, లోభం, అశాంతి, ఆశలు ఉన్నప్పుడు రజోగుణం, సోమరితనం, ప్రమాదం, మూర్ఖత్వం ఉన్నప్పుడు తమోగుణం ఉన్నాయని తెలుసుకో. సత్వగుణంతో ఉన్నప్పుడు మరణించిన బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమలోకాలు, రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే మానవజన్మ, తమోగుణం ఉన్నప్పుడు చనిపోయినవాడు పశుపక్ష్యాదుల జన్మ పొందుతారు. సత్వకర్మల వలన నిర్మల సౌఖ్యం, రాజస కర్మల వలన దుఃఖం, తామసకర్మల వలన అవివేకం కలుగుతాయి. సత్వగుణం వలన జ్ఞానం, రజోగుణం వలన లోభం, తమోగుణం వలన అజ్ఞానం, భ్రాంతి, ప్రమాదాలు ఏర్పడుతాయి. అన్ని పనుల యందూ త్రిగుణాలే కర్తలనీ, పరమాత్మ వీటికి అతీతుడని తెలుసుకొన్నవాడు నా భావం పొందుతాడు. జీవి వీటిని దాటినప్పుడే బ్రహ్మానందం పొందగలడు.

అర్జునుడు: వీటిని అతిక్రమించినవారి లక్షణాలు ఏవి?అసలు ఎలా వీటిని దాటాలి?

కృష్ణుడు:

ఈ గుణాల ఫలితాలు లభిస్తే ద్వేషింపక, లభించనప్పుడు ఆశింపక, సాక్షిగా, తను ఏమీ చేయడం లేదనుకొంటూ, తన అసలు స్వభావం గ్రహించి, సుఖదుఃఖాలను, మట్టీ, రాయి, బంగారు లను సమానంగా చూస్తూ, ప్రియము, అప్రియముల పైన సమాన దృష్టి కల్గి, ధీరుడై, పొగడ్తలు, నిందలు, మానము, అవమానము, శత్రుమిత్రులందు లందు సమబుద్ధి కల్గి, నిస్సంకల్పుడై ఉన్నవాడు గుణాతీతుడు. నిత్యమూ నన్నే నిశ్చలభక్తితో సేవించేవాడు, త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు. పరమాత్మకు, మోక్షధర్మాలకు, సచ్చిదానందానికీ, నిరాకార బ్రహ్మానికి నేనే మూలము.

వర్గం: భగవద్గీత

Address

SH-13
Andol
502270

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8:30pm
Wednesday 9am - 8:30pm
Thursday 9am - 8:30pm
Friday 9am - 8:30pm
Sunday 9am - 8:30pm

Telephone

9440848617

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Laxmi Narsimha Swamy Stationary & Xerox posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share