27/12/2017
యవ్వనుడా...
👉 ప్రతీ యవ్వన సహోదర సహోదరిమణులకు ఇది ఎంతో ముఖ్యమైన విషయం... ఉరకలు పెట్టె ఉడుకు రక్తం... ఆ క్రమంలో విచక్షణ జ్ఞానం మరువకూడదు ఈ FB Whatsapp లు ఎంత మేలు చేస్తాయో అంతకంటే మరెక్కువగా నష్టం చేకూర్చగలవు కాబట్టి ph అవసరానికి మాత్రమే వాడండి అవసరానికి మించి కాదు...
🙂 యవ్వన సోదరి సోదరులారా... సులువుగా చిక్కులుపెట్టే పాపపు జోలికి వెళ్ళకండి... పాపము గర్భము ధరించి పరిపక్వత చెంది మరనాన్ని ప్రసవిస్తుంది... పాపానికి ప్రతిఫలం నరకము...
కాబట్టి యవ్వనుడా యేసయ్య కాడి మోయుట ఎంతో సులభము... కాబట్టి మీ యవ్వన రక్తాన్ని యేసయ్య రాజ్యవిస్తరణ కొరకు.. నశించిపోవుచున్న అనేక ఆత్మలకొరకు ప్రయాసపడండి...
🙂 కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు...
యవ్వనుడా... నువెందుకు పాలివాడిగా నిన్ను నీవు సమర్పించుకోలేవు...???
యవ్వనుడా...
❤ నా యేసయ్య నిండు యవ్వనంలో తనను పంపిన తండ్రి చిత్తాన్ని అద్వితీయంగా నెరవేర్చారు... ఎవరికోసం ఆ ప్రాణత్యాగం...??? నీకోసం నా కోసం మనందరి కోసమే కదా...?
🌹 నా ప్రియ యవ్వనుడా ఎవ్వనురాలా ఈ రాత్రి గమనించండి మీ జీవితం ఎలా వెళ్తుంది... మిమ్మల్ని మీరు సరిచేసుకోండి... యేసయ్య కు ఇష్టుడవుగా మారండి... సహోదర ప్రేమ కలిగి ఉండండి... మీ మాట ఉప్పువలె ఉండాలి... క్రోదాన్ని అణచి వేసే విధంగా ఉండాలి... అది ఇప్పుడెలా సాధ్యం అంటే మీరు యేసయ్య ను వెంబడించాలి యేసయ్యకు కలిగిన దీనమనస్సును కలిగి ఉండండి...
🌺 అట్టి కృప దేవుడు ప్రతి యవ్వన సహాదరుడికి సహోదరికి కలుగును గాక... ఆమెన్...🙌