18/12/2022
👂చెవుల్లో నూనె వేస్తే చెవులు పాడవుతాయా ?
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
పాశ్చాత్యవైద్యులు చెప్పేది నిజమా ?
ఆధునిక వైద్యులు చెవుల్లో 👂ఎలాంటి నూనెలు వేయకూడదని అలావేయటం అశాస్త్రీయమని, అనారోగ్యకరమని చెబుతూ, ఎన్నో తరతరాలనుంచి చెవుల్లో రోజూ నూనె వేసే అలవాటును నేటి ప్రజలచేతపూర్తిగామాన్పించగలిగారు, చెవుల్లో నూనె వేయకూడదని చెప్పేముందు అలా నూనె వేసుకోవడంవల్ల భారతదేశంలో ప్రజలకు చెవి రోగాలే వైనా వచ్చాయా రాలేదా అని వారు ఆలోచించలేదు.
పాశ్చాత్యదేశాల్లో చలి, మంచువంటి శీతల వాతావర ణముంటుంది కాబట్టి అక్కడ ప్రజలకు చెవుల్లో నూనెవేస్తే అది గడ్డకట్టుకపోయి అనారోగ్యం కలిగించవచ్చు. కాని ఉష్ణ మండలమైన మన దేశంలో చెవుల్లో వేసే నూనె గడ్డకట్టదు. పాశ్చాత్యులు వారి దేశ, దేహ, వాతావరణ పరిస్థితులనుబట్టి రచించుకున్న వారి వైద్యగ్రంధాల్లో చెవుల్లో నూనె వేయకూ డదని ప్రకటించివుండచ్చు.
ఆ శాస్త్రాలను చదివిన మనదేశ ఆధునిక వైద్యులు, విదేశీ ప్రజలకోసం వారి దేశాల్లో సూచించిన మార్గాలు మన దేశప్రజలకు పనికిరావా? అని ఆలోచించ కుండా గుడ్డిగా 'చెవుల్లో నూనె వేయకూడదు' అని ప్రచారం చేసి ప్రజలతో మాన్పించడంవల్ల ఈనాడు దాదాపుగా ప్రజ లందరినీ ఏదో ఒకవిధమైన చెవివ్యాధి పీడిస్తూనేవుంది. పర ధర్మాచరణ ప్రమాదకరమనే సత్యాన్ని ఇప్పటికైనా అర్ధం చేసుకొని స్వధర్మం ఏంచెప్పిందో తెలుసుకుందాం.
👂చెవులు బాగుండాలంటే
చెవుల్లో నూనె వేయవలసిందే
పరిశుభ్రమైన కల్తీలేని నువ్వులనూనె గోరువెచ్చగా చెవుల్లో ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత మూడునా లుగు చుక్కల మోతాదుగా వేసుకోవాలని ఆయుర్వేద మహర్షులు సిద్ధాంతీకరించారు. ఇలా రోజూ చేయడంవల్ల జీవి తంలో చెవుడు, చెవిపోటు, చెవిలో హెూరువంటి ఏ విధమైన చెవిరోగాలు రావని తేల్చిచెప్పారు.
అంతేగాక చెవుల్లో తైలం వేయడంవల్ల మెడ బిగుసు పోయే మన్యాస్తంభవాతరోగం (స్పాండిలైటిస్) గాని, దవ డలు బిగుసుకుపోయే హనుగ్రహవాతరోగంగాని కలుగబో
వని నిర్ధారించారు. ప్రజలారా నిజానిజాలు తెలుసుకోండి!
మా ప్రియమైన ఆయుర్వేద అభిమానులారా, మన తాతముత్తాతలైన ఆయుర్వేద మహర్షులు ఎన్నో తరాల నాడే ఈ అనంతమైన ప్రకృతిని మానవ శరీరాన్ని మధించి, పరిశోధించి ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది మంచో, ఏది చెడో ఋజువుచేసి శాస్త్రరూపంలో మన సంక్షేమం కోసం అందించారు.
దేశీయమైన స్వధర్మమే మన జాతిని, మన బిడ్డలను కాపాడగలుగుతుంది గాని మన దేశ వాతావరణానికి మన దేహనిర్మాణానికి అనుగుణంగాని విదేశీయమైన పరధర్మం ఏ విధంగానూ మనలను కాపాడలేదని ఇప్పటికైనా తెలుసు కొని మహర్షులపట్ల విశ్వాసభరితమైన పూజ్యభావంతో వారు చూపిన మార్గాలను ఆచరిస్తూ జీవన స్వర్గాలను నిర్మించుకోండి
పిల్లలనుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ చెవిలో నూనె వేసుకోవచ్చు.
కనీసం ప్రతి ఆదివారం రోజు అయినా వేసుకోండి... గోరువెచ్చగా చేసుకుని వేసుకోండి...
జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం