Rajayadav yuvasena

Rajayadav yuvasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajayadav yuvasena, Shopping & retail, Nellore.

08/11/2020

*నెల్లూరు*

*అధికారులారా..మీకు అంతగా ఒత్తిళ్లు ఉంటే మాపై కేసులు పెట్టుకోండి..అమాయకులపై కాదు..*

*మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్*

రెండో పంటలో జిల్లా రైతులను సుమారు రూ.700 కోట్ల వరకు ముంచేశారు..

దిగుబడి తగ్గిపోయి ఐదారు వందల కోట్లు రైతులు నష్టపోగా పండిన పంటకు సగం ధర కూడా దక్కనీయకుండా చేశారు..

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం..

సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు జరగలేదని, జరిగితే చూపించండని ఎమ్మెల్యే సివిల్ సప్లయీస్ శాఖ డేటాను మా జిల్లా కార్యాలయానికి పంపారు..

ఆయన పంపిన జాబితాలో అనికేపల్లికి చెందిన జైపాల్ పేరుతో 57 పుట్ల ధాన్యం విక్రయించినట్టు వెలుగులోకి వచ్చింది..

తాను పండించిన 8 పుట్ల ధాన్యాన్ని విధిలేని పరిస్థితుల్లో రూ.10,100 లెక్కన దళారులు మస్తాన్, వెంకటేశ్వర్లుకు తెగనమ్ముకున్నదుస్థితి జైపాల్ ది..

తన పేరుతో రూ.8 లక్షలకు పైగా లావాదేవీలు జరగడంతో కంగారు పడిన జైపాల్ వెంటనే కలెక్టరేట్ కు వెళ్లి, తాను ప్రభుత్వానికి ధాన్యమే అమ్మలేదని, ఆ డబ్బును తనలా మోసపోయిన రైతులకు చెందేలా చూడాలని జిల్లా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు..

జిల్లా అధికారులకు అర్జీ ఇచ్చిన తెల్లారే దుర్మార్గంగా జైపాల్ ను వెంకటాచలం ఎస్సై స్టేషన్ కు తీసుకెళ్లి దళారుల ఎదుట విచారణ చేశారు..

విచారణ చేసిన వీడియోను ఎస్సై అత్యుత్సాహం చూపి తన స్వామి భక్తి చాటుకుంటూ ఎమ్మెల్యేకు పంపారు...ఆయన దానిని మీడియాకు విడుదల చేశారు..

ఆ విచారణలో 8 పుట్ల ధాన్యాన్ని రూ.10,100 లెక్కన దళారులు మస్తాన్, వెంకటేశ్వర్లుకు అమ్మినట్టు ఎస్సై ఎదురుగానే జైపాల్ స్పష్టం చేశారు..అది నిజమేనని దళారులు కూడా ఒప్పుకున్నారు..

జైపాల్ ధాన్యం కొనలేదని, కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకున్నాడనేందుకు పోలీసులు విడుదల చేసిన వీడియోనే నిదర్శనం..

కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, డీఆర్డీఏ అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారా..

కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేశామని ఎస్సై సమక్షంలోనే ఒప్పుకున్న దళారులపై ఏం చర్యలు తీసుకున్నారు...

ఈదగాలిలోని ఎర్రమట్టి గుంతల్లో వరి సాగు చేసినట్టు ఈ క్రాఫ్ బుకింగ్ చేసిన అధికారి ఎవరు..

అనికేపల్లిలో చేపలు పట్టుకుని జీవనం సాగించే పేద వ్యక్తి పేరుతో 18 ఎకరాలు రాసిన రెవెన్యూ అధికారులు ఎవరు..

ఒక్క జైపాల్ వద్దనే కాదు...గ్రామంలో చాలా మంది రైతుల వద్ద ఆధార్ కార్డులు, బ్యాంకు పాసు పుస్తకాలు తీసుకున్నామని జైపాల్ కుమారుడితో దళారి మస్తాన్ చెప్పిన ఆడియో ఆధారాలూ చూపించాం..

డీఆర్డీఏ నుంచి ఒక కోఆర్డినేటర్ వెళ్లి జైపాల్ మోసం చేశాడని పోలీసు కేసు పెడతారా..

జైపాల్ ఎవరిని మోసం చేశాడు..ఈదగాలికి పోయి రెవెన్యూ అధికారులను మోసం చేశాడా..

ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎస్సై సమక్షంలోనే దళారులు ఒప్పుకుంటే జైపాల్ మోసం చేశాడంటారా..ఎవరిది మోసం..

నిజాయతీగా బయటకు వచ్చి విచారణ జరపమని కోరిన ఒక పేద దళిత రైతును వేధిస్తున్నారంటే...అసలు జిల్లాలో ఏం జరుగుతోంది..

ఈ ఘటనకు బాధ్యులైన అన్ని స్థాయిల అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు పాపం అనుభవించకతప్పదు.. మీకున్న నైతిక విలువలు పడిపోయాయి..

అనికేపల్లికి చెందిన చేపలు పట్టుకునే రైతుకూలి జైపాల్ ఈదగాలికి పోయి 18 ఎకరాలు రాయించుకుని రైతుల వద్ద ధాన్యం కొని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకున్నాడా...మీ గుండెలపై చేయి వేసుకుని చెప్పండి..మరీ ఇంత అన్యాయమా..

చివరకు జైపాల్ తల్లి కలెక్టరేట్ కు వచ్చి కూలీనాలీ చేసుకునే తమను వేధించేబదులు ఇంత విషమివ్వండి..చస్తాం అనే పరిస్థితికి పేదోళ్లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది...

అక్రమంగా ఈ క్రాఫ్ బుకింగ్ చేసినోళ్లు, నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన వాళ్లను, దళారులను, వారి వెనకున్న మాఫియాను వదిలేసి దళిత రైతుపై కేసు పెడతారా...

ఒక పేద దళిత రైతును కేసుల పేరుతో వేధించేందుకు కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు మనస్సెలా వస్తోంది..

ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటున్నా అధికారులారా.. మీరిలా చేయడం న్యాయమేనా..

మీకు అంతగా ఒత్తిళ్లు ఉంటే మాపై కేసులు పెట్టుకోండి..అమాయకులపై కాదు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దుర్మార్గాలకు ఇది పరాకాష్ట..title

30/12/2019
happy new year 2020
30/12/2019

happy new year 2020

Address

Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajayadav yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share