19/03/2026
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐💐
ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం పేరుతో మనకి పరిచయం కాబోతుంది. చాలామంది పరాభవ అంటే అవమానాలు ఎదురవుతాయి. పేరులోనే ఉన్నది పరాభవం అనుకుంటారు. నిజానికి పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవాలు అధికంగా ఉంటాయి అని కాదు.
పరాభవ అర్థం ఏంటంటే, పరా అంటే పరా భట్టారిక(లలిత దేవి).. భవ అంటే సాక్షాత్తు భవుడు. పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు, సామరస్య స్వరూపముతో, తమ బిడ్డలును రక్షిస్తారని అర్థం.
సర్వేజనా సుఖినోభవంతు!✨💐