Padmavati All one service

Padmavati All one service super

16/12/2021
16/03/2017

100 హస్తముద్రాలు అందరికి షేర్ చేయండి
మరిన్ని స్ఫూర్తినిచ్చే విషయాలకి
ఈ పేజీ ని లైక్ చేయండి షేర్ చేయండి.

20/02/2017
13/01/2017
13/01/2017

🌿🌹🙏'భోగి' భోగభాగ్యాలతో🙏🌹🌿
🌿🌹🙏సంక్రాంతి' సంపదలతో🙏🌹🌿
🌿🌹🙏'కనుమ కనువిందుగా🙏🌹🌿
🌿🌹జరుపుకోవాలని కోరుకుంటూ.🌹🌿
🌿🌹మీకు,కుటుంబ సభ్యులందరికీ🌹🌿
🌿🌹హృదయపూర్వక శుభాకాంక్షలు🌹🌿
🌿🌺🌼🌸🌻🌷🌻🌸🌼🌺🌿

Pdvt service castamarla devullaki aagla samvatsara shubhakshalu
31/12/2016

Pdvt service

castamarla devullaki aagla samvatsara shubhakshalu

29/12/2016

నక్షత్రాలు రాశులు....!!

కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు.

వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె.వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి
తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు.

ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి,
మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ,
పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త,
చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,శ్రవణము,ధనిష్ఠ,శతభిషము, పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర, రేవతి.

ఆ బిడ్డలకు తగిన వరుని కొఱకు దక్షుడు
మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తనకుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు. అనిపురాణ కథ

ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏ నక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.

అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం

మేషం: అశ్విని మొత్తం, భరణి మొత్తం, కృత్తిక 1వ పాదం

వృషభం: కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1వ, 2వ పాదాలు

మిథునం: మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర మొత్తం, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు

కర్కాటకం: పునర్వసు4వ పాదం, పుష్యమి మొత్తం, ఆశ్లేష మొత్తం

సింహం: మఘ మొత్తం, పుబ్బ(పూర్వ ఫల్గుణి)మొత్తం, ఉత్తర (ఉత్తర ఫల్గుణి)1వ పాదం

కన్య: ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2వ,3వ,4వ పాదాలు,
హస్త మొత్తం, చిత్త 1వ,2వ పాదాలు

తుల: చిత్త 3వ,4వ పాదాలు, స్వాతి మొత్తం, విశాఖ 1వ, 2వ,3వ పాదాలు

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం, జ్యేష్ఠ మొత్తం

ధనుస్సు: మూల మొత్తం, పూర్వాషాఢ మొత్తం, ఉత్తరాషాఢ 1వ పాదం

మకరం: ఉత్తరాషాఢ 2వ,3వ,4వ పాదాలు, శ్రవణం మొత్తం,ధనిష్ఠ 1వ,2వ పాదాలు

కుంభం: ధనిష్ఠ 3వ,4వ పాదాలు, శతభిషం మొత్తం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం, రేవతి

22/12/2016

*ధర్మో రక్షతి రక్షితః*

యజ్ఞం జరుగుతోంది.యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది.

ఆయన ఆశ్చర్యపోయాడు.
అప్పుడు భార్య చెప్పింది. "నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."

ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది.

అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు.

ఒక్క అర్క సోమయాజి తప్ప.

"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.

ఊరు ఊరంతా ధనవంతులయ్యారు.

ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు.

"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది.

ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

ఊరి పొలిమేర దాటాడో లేదో...

ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
............అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.............

అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.

"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.

*ధర్మో రక్షతి రక్షితః*

సోర్స్: Message

Address

Rajavolu Road, Amy High Scool
Rajahmundry
533105

Telephone

+919603124555

Website

Alerts

Be the first to know and let us send you an email when Padmavati All one service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Padmavati All one service:

Shortcuts

Share

Category