14/11/2024
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి వారి హక్కులను కాపాడటం, బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడం మన బాధ్యత. బాలల్ని సక్రమ మార్గంలో నడిచేలా చేస్తే దేశం కూడా అదే బాటలో పయనిస్తుందనడంలో సందేహం లేదు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున ఘనంగా బాలల దినోత్సవం జరుపుకుంటూ.. ఆయనకు నివాళులు అర్పిస్తూ.. అ బాలల హక్కులను కాపాడేందుకు సంకల్పం చేద్దాం. సామాజిక, ఆర్ధిక బలహీనతలు బాలల దరికి చేరకుండా వారికి మంచి భవిష్యత్ ను అందిద్దాం.