04/06/2026
ఇలాంటివి యాడ్ ల వరకు బాగుంటుంది అండి.
రాజకీయ నాయకులకు
మనల్ని పరిపాలించే నాయకులకు
అంతకు మించి మనకు చిత్త శుద్ది ఉంటే
ఒక చిన్న కిరాణా షాపు కి వెళ్ళి చూడమనండి
పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్
బిస్కెట్ నూడిల్స్ మనం షేవింగ్ చేసుకోడానికి వాడే రేజర్
ఇలా ఎన్నో వస్తువుల ప్యాకింగ్ దేనితో ఉంటుంది..??
జీఎస్టీ అదే టాక్స్ కడితే చాలు ప్రజల్ని పెద్దించుకుని తినే నాయకుడు ఇలాంటి ప్లాస్టిక్ కంపెనీ లకు లైసెన్స్ యూ ఇవ్వడం మామూలు విషయం..
ఇంకో.విషయం మనం ప్రయాణాల్లో లేని స్టేటస్ మెయింటైన్ చేయడానికి గొప్పగా 10. లేక 20 రూపాయల ధారపోసి కొనుక్కునే నీళ్ల బాటిల్ వలన మనకు క్యాన్సర్ వస్తుందని ఎంత మందికి తెలుసు..
ఆ నీళ్లు తాగి పడేసే బాటిల్ వలన నెల సారం ఎంత పడాయి పోతుంది దాని వలన పర్యావరణం ఎంత నాశనం అయిపోతుంది అనే విషయం ఎంత మందికి ఆలోచించే సమయం ఉంది..
2070 వచ్చే సరికి ఈ ధరిత్రి అగ్ని గుండం.లా మారబోతుంది. సముద్ర మట్టం పెరిగి పోయి సముద్ర తీరాలు ముంపుకు గురి అయ్యి కొన్ని. ఊర్లు సముద్ర గర్భం లో కలిసిపోతాయి..
మన పిల్లలు
వాళ్ళ.పిల్లల భవిష్యత్ మొత్తం నాశనం చేసే జనరేషన్ కి మనమే ప్రతినిధుల లాగ మిగిలిపోయే పరిస్థితి నుండి బయట పడాల్సిన బాధ్యత మనకే ఉంది.
దయచేసి చికెన్ mutton కో వెళ్ళి నప్పుడు స్టీల్ box తీసుకెళ్ళండి వాడు ఇచ్చే ప్లాస్టిక్ కవర్ వలన ఎంత దారుణం జరుగుతుందో ఒక్క మాట చెప్తా వినండి
మీరు తెచ్చిన muttun చికెన్ లో ఉన్న కొవ్వు వేస్ట్ మాసం మన ఇంట్లో ఆడవాళ్లు షాప్ వాడు ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ లో వేసి ఇంటి పక్కన ఉన్న సందులో పడవేస్తారు. ఆ ప్లాస్టిక్ కవర్ లో ఉన్న వృధా మాంసం భూమిలో ఇంకదు ఆది ఆ కవర్ లోనే ఉండటం వలన బ్యాక్టీరియా తయారయ్యి ఆ భూమి సారాన్ని మరియు భూమి నీ నాశనం చేస్తాయనే ఆలోచన ఎంత మందికి ఉంది...
కిరాణా సామానులు Dmart లాంటి పెద్ద షాపుల్లో కొనకండి
మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న కిరాణా షాపుల్లో పావుకిలో అరకిలో తెచ్చుకోండి ఆది కూడా పేపర్ లో కట్టి ఇవ్వమని అడగండి..
చివరిగా ఒక్కమాట
ఒకవేళ మీరు ప్లాస్టిక్ రూపంలో ఏ వస్తువు అయినా కొనుకున్న తరువాత ఆ ప్లాస్టిక్ ను ఉదాహరణకు చాక్లెట్ బిస్కెట్ etc
వాటిని మీ.ఇంట్లో ఒక చోట చేర్చి వారానికి ఒకసారి మీ మున్సిపల్ చెత్త తీసుకెళ్ళే వాడికి ఇవ్వండి
దీనివలన ఈ ధరిత్రి కి ఎంతో.మేలుచేసిన వాళ్ళం అవుతాము మరియు
మన బావి తరాల పిల్లల భవిష్యత్
వాళ్ళ ఆరోగ్యానికి
మేలు చేసిన వాళ్ళము అవుదాం...
జై హింద్.